నాదెండ్లకు చుక్కలు చూపించి.. దాడికి యత్నం!

Published on Mon, 02/26/2024 - 21:48

సాక్షి, పశ్చిమగోదావరి: జనసేనలో సీట్ల పంచాయితీ ‘ముష్టి’ యుద్ధానికి దారి తీస్తోంది. తాజాగా పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌కు జనసేన శ్రేణులు చుక్కలు చూపించాయి. ఆయన బస చేసిన చోట నిరసనకు దిగాయి. అక్కడితో ఆగకుండా బూతులు తిడుతూ నాదెండ్లపై దాడికి సైతం యత్నించాయి.  

తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న జరగబోయే జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలనకు సోమవారం నాదెండ్ల మనోహర్‌ వెళ్లారు. పెంటపాడు మండలం అలంపురంలోని జయా గార్డెన్స్‌లో రాత్రి బస చేశారాయన. సమాచారం అందుకున్న వెంటనే జనసేన ఇన్‌ఛార్జి విడివాడ రామచంద్రరావు, తన అనుచరులు, కొంతమంది కార్యకర్తలతో గెస్ట్‌హౌజ్‌ దగ్గర నిరసనకు దిగారు. రామచంద్రరావుకు అనుకూలంగా ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో తాడేపల్లిగూడెం డీఎస్పీ భారీగా పోలీసులతో అక్కడ మోహరించగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

మరోవైపు బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్‌లు ఎంత సముదాయించిన రామచంద్రరావు మాట వినలేదు. ‘టికెట్‌ ఇవ్వకపోతే ప్రాణం తీసుకుంటా’ అంటూ బెదిరించారు. ఈ క్రమంలో బొలిశెట్టి వర్సెస్‌ విడివాడ వర్గాలుగా విడిపోయి జనసేన శ్రేణులు బాహాబాహీకి యత్నించాయి. బోలిశెట్టి సత్యనారాయణపై కొందరు కార్యకర్తలు భౌతిక దాడికి దిగారు.  మనోహర్ బస చేసిన చోటే రచ్చ రచ్చ చేశారు. అదే సమయంలో కొందరు కార్యకర్తలు మనోహర్‌ను బూతులు తిడుతూ కనిపించారు. 

వారాహి యాత్రలో స్వయంగా పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడంతో తణుకు సీటు జనసేనదేనని.. రామచంద్రరావు పోటీ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అంతేకాదు.. పొత్తులో భాగంగా చాలా కాలం దాకా ఇరుపార్టీల ఉమ్మడి అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావు పేరు బలంగా వినిపించింది.  సీన్ కట్ చేస్తే..  ఉమ్మడి జాబితాలో రామచంద్రరావుకు ఘోర అవమానం జరిగింది. టికెట్‌ టీడీపీకి చెందిన  అరిమిల్లి రాధాకృష్ణకు వెళ్లింది. దీంతో రామచంద్రరావు వర్గీయులు రగిలిపోతున్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)