Breaking News

బాబు దుష్టపన్నాగమే ఇది.. ఏపీలో ఈసీ ఉండి ఏం లాభం?: వాసిరెడ్డి పద్మ

Published on Wed, 05/08/2024 - 13:04

గుంటూరు, సాక్షి: ఎన్డీయే కూటమిలో ఉన్నంత మాత్రాన ఎన్నికల సంఘం తనను ఏమీ చేయదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారా? అని నిలదీశారు వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ. నల్లజర్లలో రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై టీడీపీ గుండాలు దాడికి యత్నించిన ఘటనపై బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా ద్వారా పద్మ స్పందించారు.  

‘‘టీడీపీ శ్రేణులు బరితెగించాయి. సాక్షాత్తూ దళిత హోంమంత్రి తానేటి వనిత మీద దాడికి యత్నించాయి. ఈ ఘటన వెనుక చంద్రబాబు దుష్టపన్నాగం ఉంది. దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా చంద్రబాబు వ్యవహరించారు. అసలు దళితులంటే ఎందుకంత చిన్నచూపు చంద్రబాబూ..?.

ఒక రాష్ట్ర హోంమంత్రి.. అందునా మహిళ ప్రచారంలో ఉంటే దాడి చేయటం దుర్మార్గపు విషయం. ఇంటి మీదకు వెళ్లి మరీ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఎన్డీయే కూటమిలో ఉన్నంత మాత్రాన ఈసీ ఏమీ చేయదని చంద్రబాబు భావిస్తున్నారా?.  

.. మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు. కానీ, చంద్రబాబు మహిళల మీద వివక్ష చూపుతున్నారు. ఇప్పటికే ఇంటింటి పెన్షన్లు నిలిపివేయించి.. అవ్వాతాతల ప్రాణాలు తీశారు. ఇప్పుడేమో దళితులు, మహిళల మీద దాడులకు తెగపడ్డారు.

.. ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినా స్పందించటం లేదంటే  చంద్రబాబుకు ఎంత లెక్కలేని తనం?. ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోకపోతే అది ఉండీ ఏం ప్రయోజనం?. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పని చేయాలి’’ అని వాసిరెడ్డి పద్మ కోరారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)