Breaking News

రాయ్‌బరేలీ పోరులో వరుణ్ గాంధీ.. ప్రియాంకపై పోటీకి నో

Published on Thu, 04/25/2024 - 21:03

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం హాట్‌ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు ప్రచారం సాగుతోది. అయితే ఆమెకు పోటీగా అదే కుటుంబానికి చెందిన వరుణ్ గాంధీని రంగంలోకి దించాలని బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. కానీ పార్టీ ప్రతిపాదనను వరుణ్ గాంధీ తిరస్కరించినట్లు సమాచారం.  రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో తన సోదరి ప్రియాంక గాంధీపై పోటీ చేసేందుకు ఆయన నిరాకరించినట్లు సమాచారం. 

కాగా రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి వరకు తన అభ్యర్థులను ప్రకటించలేదు. అటు బీజేపీ కూడా రాయ్‌బరేలీలో తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. కాగా కాంగ్రెస్‌ నుంచి యాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉంది. రాయ్‌బరేలీ నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి నుంచి ప్రియాంక బరిలో దిగనున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో తన సిట్టింగ్‌ స్థానమైన పిలిబిత్‌ నుంచి బీజేపీ టికెట్‌ నిరాకరణకు గురైన వరుణ్‌ గాంధీ.. రాయ్‌బరేలి నుంచి పోటీకి దించితే కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఎదురవుతుందని బీజేపీ హైకమాండ్‌ పావులు కదుపుతోంది. ఈ విషయంపై వరుణ్‌ను సంప్రదించగా.. ఆయన నిరాసక్తి కనబర్చినట్లు తెలుస్తోంది. ‘గాంధీ వర్సెస్‌ గాంధీ’  పోటీ ఉండటం తనకు నచ్చకపోవడంతో రాయ్‌బరేలీ పోరు నుంచి తప్పుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)