Breaking News

జగన్‌ను చూసి నేర్చుకోండి

Published on Thu, 03/21/2024 - 01:58

ముషీరాబాద్‌ (హైదరాబాద్‌): ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సామాజిక న్యాయం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సామాజిక న్యాయం విషయంలో అక్కడి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లలో 50 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలకు కేటాయించి ఔరా అనిపించుకున్నారని ప్రశంసించారు.

2019తో పోలిస్తే అత్యధికంగా బీసీలకు 48, ఎస్సీలకు 29, ఎస్టీలకు ఏడు, మహిళలకు 19 టికెట్లు కేటాయించారని కొనియాడారు. రెండు రోజుల క్రితం రేవంత్‌రెడ్డి 37 కార్పొరేషన్ల చైర్మన్‌లను ప్రకటిస్తే 17 అగ్రకులాలకు ఇచ్చారని, 50 శాతం ఉన్న బీసీలకు కేవలం 13, 12 శాతం ఉన్న ఎస్టీలకు మూడు, 20 శాతం ఉన్న ఎస్సీలకు కేవలం ఒకే ఒక్క చైర్మన్‌ పదవిని ఇచ్చారని తెలిపారు.

దీన్ని బట్టే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కేవలం మాటలకు మాత్రమే పరిమితం అని అర్ధమవుతోందన్నారు. ఉద్యమకారులను వాడుకుని వదిలేశారని మాజీ సీఎం కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్‌రెడ్డి, 37 చైర్మన్‌ పోస్టులలో ఒక్కటి కూడా ఓయూ ఉద్యమకారులకు ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్‌ బాటలోనే పయనిస్తున్నట్లు అర్ధమవుతోందన్నారు.  

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)