కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్
Breaking News
‘అమరావతి పేరుతో వ్యాపారం చేస్తున్నారు’
Published on Fri, 03/06/2026 - 17:05
గుంటూరు: రాజధాని అమరావతి పేరుతో వ్యాపారం చేస్తున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. సంవత్సరానికి మూడు పంటలు పండే భూములను చంద్రబాబు తీసుకున్నాడని, అలా చేయవద్దని ఆయనకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. రైతుల నుంచి అడ్డగోలుగా భూములు లాక్కున్నారని మండిపడ్డారు.
నా సలహాలు, సూచనలను చంద్రబాబు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. మొత్తం వ్యవసాయ భూములను కాంక్రీట్ తో నింపేశారు. భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలను కాపడాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలకు దిక్కు ఎవరు. అమరావతి రాజధానిని కూడా పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తారా?, అమరావతి రాజధాని పేరుతో వ్యాపారం చేస్తున్నారు. రైతుల నుండి అడ్డగోలుగా భూములు లాక్కున్నారు.రెండో విడత భూ సేకరణకు రైతులు సిద్ధంగా లేరు’ అంటూ విమర్శించారు.
Tags : 1