చంద్రబాబుపై టీడీపీ సీనియర్ నేత ఫైర్‌

Published on Wed, 05/28/2025 - 22:07

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. చంద్రబాబు ఆలోచనల్లో కార్పోరేటర్లు, ధనవంతులు తప్ప సామాన్యులు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. సామాన్యుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదన్నారు. ‘ఏపీ ప్రజలకు మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. గతంలో సోమవారం పోలవరం అని వారం వారం చంద్రబాబు తిరిగారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం మంగళం పాడుతుంటే చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు. పోలవరం ఎత్తు తగ్గించి , పునరావాసం ఎగ్గొడుతుంటే ఎందుకు చంద్రబాబు స్పందించడం లేదు. ప్రజల్ని ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు చంద్రబాబు

పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నాడని మోదీ విమర్శించారు. పోలవరం పై చంద్రబాబు మహానాడులో తీర్మానం చేయాలి. బనకచర్ల - గోదావరి మీద ఉన్న శ్రద్ధ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పై లేదు. పోలవరమే ఇంతవరకూ పూర్తికాలేదు. 80 వేల కోట్లతో బనకచర్ల - గోదావరి ఎప్పటికి పూర్తిచేద్దామని అడుగుతున్నాను. కాంట్రాక్టర్లకు , రాజకీయ నాయకులకు  లాభం చేకూర్చేందుకు బనకచర్ల - గోదావరి టెండర్లకు తొందరపడుతున్నారు. కేంద్రం పై ఒత్తిడి తెచ్చి పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి. జూన్ 2 నాటికి 2 లక్షల 20 వేల టిడ్కో ఇళ్లు పూర్తిచేసి ఇస్తామన్నారు.

ఎన్ని ఇళ్లు పూర్తిచేశారో మంత్రి నారాయణ సమాధానం చెప్పాలి. టిడ్కో ఇళ్లు పూర్తిచేయలేదు కానీ...భారీ అంతస్తులు భవనాలకు అనుమతిలిచ్చామని పేపర్లలో ప్రకటనలిస్తున్నారు. 22ఏ పేరుతో రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నారు’ అని మండిపడ్డారు.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)