Breaking News

చంద్రబాబుపై మరోమారు వడ్డే శోభనాద్రీశ్వరరావు ఫైర్‌

Published on Thu, 06/12/2025 - 17:40

సాక్షి, విజయవాడ: చంద్రబాబుపై మరోమారు టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. గురువారం.. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్‌ సమావేశం జరిగింది. ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన-రైతాంగానికి ఇచ్చిన హామీలు- అమలు’పై చర్చ జరిగింది. ఈ సమావేశంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఎం నాయకులు పి.మధు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదైపోయిందని.. రైతులకు 20 వేలు సాయం చేస్తామన్నారు. ఎన్నికలయ్యాక ఒక ఖరీఫ్, ఒక రబీ సీజన్ అయిపోయాయి. కేంద్రం ఇచ్చేవి కాకపోయినా మీరు ఇస్తామన్న 14 వేలైనా ఇవ్వాలి కదా. గతంలోనూ రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు రెండు కిస్తీలు ఎగ్గొట్టేశాడు.

..రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కూడా కనీస మద్దతు ధర దొరకడం లేదు. పక్క రాష్ట్రం తెలంగాణలో క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. వెస్ట్ బెంగాల్, కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు బోనస్ రూపంలో రైతుకు కొంత సాయం చేస్తున్నాయి. చంద్రబాబు కనీసం రైతుల గురించి ఆలోచన చేయడం లేదు’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.

‘‘ఏడాది నుంచి మెట్రో రైలు, రింగ్ రోడ్డు, ఐకానిక్ వంతెనలు అంటూ భజన చేస్తున్నారు. కృష్ణానదిపై 15 కిలోమీటర్లకు ఒక ఐకానిక్ వంతెన కట్టాలని ఓ ఛానల్‌లో చెబుతున్నారు. చంద్రబాబు బాధ్యతా రాహిత్యంగా పిచ్చి ఊహాలోకంలో విహరిస్తున్నాడు. ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు ఇంకా పూర్తికాలేదు. ఏదో స్వప్రయోజనం మనసులో పెట్టుకుని పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం ఆలోచన చేస్తున్నాడు. భూములను 22ఏలో చేర్చి చిన్ని చిన్న రైతులను ఇబ్బంది పెడుతున్నారు. భూములు రైతుల వద్ద కాకుండా.. ప్రభుత్వం వద్దే ఉండాలనేది చంద్రబాబు ఆలోచన.

అమరావతిలో భూములిచ్చిన రైతులకు హామీలిచ్చి మోసం చేశారు. గతంలో గ్రాఫిక్స్‌తో మూడేళ్ల పాటు కథ నడిపించారు. ఇప్పుడు మళ్లీ 45 వేల ఎకరాలు రాజధానికి తీసుకుంటామంటున్నారు. ఐదు వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు కడతామంటున్నారు. గన్నవరంలో ఎయిర్‌పోర్టు ఉంటే అమరావతిలో మరో ఎయిర్ పోర్టు అవసరమా?. శ్రీకాకుళం ప్రజలకు కావాల్సింది తాగు, సాగునీరు కానీ.. ఎయిర్ పోర్టు కాదు. శ్రీకాకుళంలో ఎయిర్ పోర్టు కడితే సరిపోదు. ఎక్కేవాడు కావాలిగా.. ఇన్నేళ్ల అనుభవమున్న నిన్ను ఏమనుకోవాలి?. చంద్రబాబు ఇప్పటికైనా ప్రజావ్యతిరేకమైన పిచ్చి ఆలోచనలను మానుకోవాలి’’ అని  వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)