Breaking News

జోషీమఠ్‌లో కానరాని ప్రచారం.. కారణమిదేనా?

Published on Wed, 04/10/2024 - 10:04

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌ పేరు వినగానే గతంలో అక్కడ చోటుచేసుకున్న భూమి కుంగుబాటు ఉదంతం గుర్తుకు వస్తుంది. ఇంతకుమునుపు ఈ ప్రాంతం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నేతలు ఈసారి ఈ సమీప ఛాయలకు కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

లోక్‌సభ ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు శరవేగంగా ప్రచారం సాగిస్తున్నాయి. నేతలు వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌, చమోలి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం కనిపించడం లేదు. రాజకీయ నేతలు ఈ ప్రాంతానికి దూరంగా ఉంటున్నారు. ఉత్తరాఖండ్‌లోని పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో జోషీమఠ్‌, దసౌలి డెవలప్‌మెంట్ బ్లాకులో భూమి కుంగిన దరిమిలా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడి ప్రజలు తమను ప్రశ్నిస్తారనే భయంతో ప్రచారానికి నేతలు వెళ్లడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

జోషీమఠ్‌కు చెందిన బీజేపీ నేతలు కూడా ఈ ప్రాంతంలో ప్రచారం నిర్వహించకపోవడం విశేషం. కాగా లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో అంటే ఏప్రిల్ 19న ఉత్తరాఖండ్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్, గర్వాల్, అల్మోరా, నైనిటాల్-ఉధమ్ సింగ్, హరిద్వార్ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)