Breaking News

మొరాయిస్తున్న ఈవీఎంలు.. భారీ వర్షంతో పోలింగ్‌కు అంతరాయం

Published on Mon, 05/13/2024 - 09:30

ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్‌ జరుగుతోంది. ఈ దశలో రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 130 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ కన్నౌజ్‌ స్థానం నుంచి పోటీకి దిగారు.

లఖీమ్‌పూర్‌ ఖీరీ జిల్లాలోని ఫూల్‌బెహడ్‌ పరిధిలోని భూఢ్‌ గ్రామంలో వర్షం కారణంగా బూత్‌ నంబర్‌ 259లో పోలింగ్‌ నెమ్మదిగా జరుగుతోంది. ఉదయం ఎనిమిది గంటల వరకూ ఈ బూత్‌లో కేవలం 40 మంది మాత్రమే ఓటు వేశారు. భారీ వర్షం కారణంగా పోలింగ్‌ బూత్‌ ఖాళీగా కనిపిస్తోంది. మరోవైపు బహరాయిచ్‌ పరిధిలోని కార్త్‌నియాఘాట్‌ అటవీ ప్రాంతంలో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ముఖ్యంగా  మహిళా ఓటర్లు ఇక్కడ అత్యధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. కాగా ఓటరు గుర్తింపు కార్డు సరిపోలని కారణంగా నలుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

కాన్పూర్‌లో పోలింగ్‌ ప్రారంభానికి ముందే ఈవీఎంలు మొరాయించాయి. ఫలితంగా గంగా గంజ్‌, బిఠూర్‌, కల్యాణ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో పోలింగ్‌ కొద్దిసేపు నిలిచిపోయింది. కల్యాణ్‌పూర్‌లో ఈవీఎంలు మొరాయించిన విషయాన్ని సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రాజారామ్‌ పాల్‌ ఒక ట్వీట్‌ ద్వారా ఎన్నికల సంఘానికి తెలియజేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)