Breaking News

మరో వివాదంలో కేంద్ర మంత్రి సురేష్‌గోపీ

Published on Sat, 06/15/2024 - 17:09

తిరువనంతపురం: ఇటీవలే కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేరళ బీజేపీ ఎంపీ, సినీ నటుడు సురేష్‌గోపీ మరో వివాదానికి తెర తీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ‘మదర్‌ ఆఫ్‌ ది నేషన్‌’గా అభివర్ణించి సంచలనం రేపారు.

శనివారం(జూన్‌ 15) కేరళ త్రిసూర్‌లోని కాంగ్రెస్‌ నేత కరుణాకరణ్‌ సమాధి ‘మురళి మందిర్‌’ను సందర్శించి నివాళులర్పించిన సందర్భంగా సురేష్‌గోపీ ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతేగాక కరుణాకరన్‌తో పాటు మాజీ సీఎం ఈకే నయనార్‌ తనకు రాజకీయ గురువులని తెలిపారు. కేరళ కాంగ్రెస్‌కు కరుణాకరణ్‌ తండ్రి అని చెప్పారు.   అయితే తన ఈ వ్యాఖ్యలకు ఎలాంటి రాజకీయ  ఉద్దేశాలు ఆపాదించవద్దని మీడియాను కోరారు. 

ఇటీవల తాను కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కొన్ని మీడియా ఛానళ్లు తప్పుడు ప్రచారం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో తొలిసారిగా బీజేపీ ఖాతా తెరిచింది. త్రిసూర్‌ నుంచి సురేశ్‌గోపీ 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి రాష్ట్రం నుంచి గెలిచిన తొలి బీజేపీ  ఎంపీగా రికార్డు క్రియేట్‌ చేశారు. దీంతో కేంద్రంలోని మోదీ3.0 మంత్రి వర్గంలో సురేశ్‌గోపీకి చోటు దక్కింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)