Breaking News

కేంద్ర మంత్రికి నిరసన సెగ! నల్లజెండాలతో ‘గో బ్యాక్‌’ నినాదాలు

Published on Sun, 03/10/2024 - 16:47

బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు నిరసన సెగ తగిలింది. బిహార్‌లోని తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన బెగుసరాయ్‌లో పార్టీ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. బచ్వాడాలో ఒక కార్యక్రమానికి వెళుతుండగా సొంత పార్టీ కార్యకర్తలే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల జెండాలను ప్రదర్శించారు.

గిరిరాజ్ సింగ్ ఇటీవల తన బెగుసరాయ్‌ నియోజకవర్గంలో యాక్టివ్‌ అయ్యారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు నిరంతరం చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

ఆదివారం బరౌని డెయిరీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగించుకుని బచ్వాడలో మరో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఎన్‌హెచ్‌-28లోని రాణి గ్రామ సమీపంలో సొంత పార్టీ కార్యకర్తలే కేంద్ర మంత్రి గిరిరాజ్‌​ సింగ్‌కు నల్లజెండాలు చూపించారు. కాన్వాయ్‌ను చుట్టుముట్టిన వారు, బీజేపీ జెండాలతో పాటు నల్ల జెండాలను పట్టుకుని, ఆయన వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో గిరిరాజ్ సింగ్ కాన్వాయ్ కొద్దిసేపు నిలిచిపోయింది.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నల్లజెండాలు చూపుతున్న వారిని చెదరగొట్టి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పెప్సీ ప్లాంట్‌లో బెగుసరాయ్‌ వాసులెవరికీ ఉపాధి కల్పించలేదని నిరసనకారులు చెబుతున్నారు. ఆయనకు డబ్బులిచ్చినవారికి మాత్రమే ఉపాధి కల్పించారని ఆరోపించారు. అయితే తమ కార్యకర్తలు కేంద్ర మంత్రికి స్వాగతం పలికేందుకే వచ్చారని బీజేపీ చెబుతోంది. నల్ల జెండాలు ప్రదర్శించినవారు సీపీఐ మద్దతుదారులని పేర్కొంది.

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)