Breaking News

కులగణనపై కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ కీలక వ్యాఖ్యలు

Published on Sat, 07/20/2024 - 16:08

ఢిల్లీ: కేంద్రమంత్రి, ఎల్జేపీ(రామ్‌ విలాస్‌) పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ దేశవ్యాప్త కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కులగణన చేసి వాటి వివరాలు బహిర్గతం చేస్తే సమాజంలో విభజనకు దారి తీస్తుందని అ‍న్నారు. కులగణన వివరాలు వెల్లడిస్తే జరిగే పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిరాగ్‌ పాశ్వాన్‌ పీటీఐ ఎడిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు.

లోక్‌సభ ఎన్నికల సందర్బంగా బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన.. దేశంలో ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి హామీలపై ఎటువంటి చర్చలు ఎన్డీయే కూటమిలో జరగటం లేదని స్పష్టం చేశారు. 

‘మా ముందుకు ఇప్పటికీ ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ముసాయిదా రాలేదు. మేము ఆ ముసాయిదాను పరిశీలించాలి. ఎందుకంటే భారత్ భిన్నత్వం ఏకత్వం గల దేశం కావున, మాకు కొన్ని ఆందోళనలు ఉన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో భాష, సంస్కృతి, జీవనశైలిలో చాలా వ్యత్యాలు ఉంటాయి. అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనుకోవటంపై నాకు ఆశ్చర్యం కలుగుతోంది. 

.. అయితే ఉమ్మడి పౌరస్మృతి  అంశం చర్చకు వచ్చినప్రతిసారి హిందూ, ముస్లింల వ్యవహారంగా కనిస్తోంది. కానీ, ఇది అందరి మత విశ్వాసాలు, సంప్రదాయాలు, వివాహ పద్దతులకు సంబంధించింది. హిందు, ముస్లింలను వేరు చేసింది అస్సలే కాదు. ఇది అందరినీ ఏకం చేసేది మాత్రమే’ అని అన్నారు.

మరోవైపు.. ‘ప్రభుత్వం కులాల వారీగా చేపట్టే సంక్షేమ పథకాలకు కులగణన ఎంతో ఉపయోగపడుతంది. కోర్టులు కూడా కులాల వారీ జనాభా డేటాను పలసార్లు ప్రస్తావించింది. అయితే ఈ డేటాను ప్రభుత్వం తన వద్దనే ఉంచుకోవాలి. బయటకు విడుదల చేయవద్దు. అయితే కులగణన డేటాను బహిర్గతం చేయడాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఆలా చేయటం వల్ల సమాజంలో కులాల మధ్య విభజనకు దారి తీస్తుందనే ఆందోళన కలుగుతోంది’ అని కేంద్రమంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)