Breaking News

‘ఇండియా’ కూటమి సిగ్గు పడాలి

Published on Thu, 05/09/2024 - 05:29

న్యూఢిల్లీ: పిట్రోడా వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఖండించారు. ‘‘నేను దక్షిణ భారతదేశం నుంచి వచ్చా. నేను భారతీయురాలిగా కనిపిస్తా. నా బృందంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు సైతం సభ్యులుగా ఉన్నారు. వారంతా భారతీయులుగానే కనిపిస్తారు. నా సహచరులైన పశి్చమ ప్రాంతాల ప్రజలు కూడా భారతీయులుగానే కనిపిస్తారు.

 రాహుల్‌ గాం«దీకి గురువైన ఓ జాత్యహంకారికి మాత్రం భారతీయులు ఆఫ్రికన్లు, చైనీయులు, అరబ్బులు, శ్వేతజాతీయులుగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకుల అసలు రంగు బయటపడింది. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలి. విపక్ష ‘ఇండియా’ కూటమి సిగ్గు పడాలి’’ అని నిర్మలా సీతారామన్‌ ధ్వజమెత్తారు.  

కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలి  
పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. సోనియా గాంధీ కుటుంబంతో పిట్రోడాకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని చెప్పారు. పిట్రోడాను ఇండియన్‌ ఓవర్‌సీస్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ పదవి నుంచి తక్షణమే తొలగించాలని స్పష్టం చేశారు. దక్షిణ భారత ప్రజలను ఆఫ్రికన్లతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై నాలుగు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించాలని అన్నారు. రాహుల్‌ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను హేళన చేస్తూ మాట్లాడుతుంటారని, దీని వెనుక శామ్‌ పిట్రోడా సలహాలు ఉంటాయని రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆరోపించారు.  

దురదృష్టకరం: జైరామ్‌ రమేశ్‌   
శామ్‌ పిట్రోడా వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ స్పందించారు. ఇండియాలోని వైవిధ్యాన్ని వరి్ణస్తూ పిట్రోడా ప్రస్తావించిన పోలికలు దురదృష్టకరమని పేర్కొన్నారు. అవి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని చెప్పారు. పిట్రోడా అభిప్రాయాలతో తమ పారీ్టకి ఎలాంటి సంబంధం లేదని తేలి్చచెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)