Breaking News

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌

Published on Wed, 09/18/2024 - 14:54

ఢిల్లీ: జమిలి ఎన్నికలకు మరో ముందడుగు పడింది. వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకే దేశం ఒకే ఎన్నికపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలి(ఒకేసారి దేశవ్యాప్త) ఎన్నికలు నిర్వహిస్తామని నిన్ననే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.

శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. కాగా, వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ను వ్యతిరేకిస్తున్నామని.. పార్లమెంట్‌లో బిల్లు పెడితే ఓడిస్తామంటూ కాంగ్రెస్‌ చెబుతోంది. గత నెల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో జమిలి ఎన్నికలను ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: ఈ టర్మ్‌లోనే జమిలి ఎన్నికలు

దేశవ్యాప్తంగా ఏడాది ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, వీటి ప్రభావం దేశ అభివృద్ధిపై పడుతుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి జమిలి ఎన్నికలే పరిష్కారమని తేల్చి చెబూతూ.. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలోనూ ‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’ అంశం ఉన్నందున మళ్లీ మూడోసారి మోదీ సారధ్యంలో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం వంద రోజులు పూర్తిచేసుకున్న తరుణంలో జమిలి ఎన్నికల దిశగా అడుగులు పడ్డాయి.

దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు, లోక్ సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలన మొదటి నుంచీ జమిలి ఎన్నికల నిర్వహణపై పట్టుదలగా ఉన్న ప్రధాని మోదీ ఈ అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతిరామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే దిశగా కమిటీ పనిచేసింది. ప్రజల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించింది. స్పందన కూడా విశేషంగా వచ్చింది. వేల సంఖ్యలో ఈ-మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. పూర్తి సాధ్యాసాధ్యాలను అధ్యయనంర చేసిన రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఇటీవలే కేంద్రానికి నివేదికను సమర్పించింది.

 

 


 

 


 


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)