బీజేపీ ఏ పార్టీతో కలవలేదు.. కలవదు

Published on Fri, 07/07/2023 - 03:31

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ‘బీజేపీ ఏ పార్టీతో కలవ లేదు, కలువబోదు’ అని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ‘మా మీద గుడ్డి ద్వేషంతో.. వారి కాళ్ల కింద భూమి కదిలిపోతోందని కొందరు కుట్రలు చేస్తున్నారు.

కొన్ని మీడియా సంస్థలు, పేపర్లు, యూట్యూబ్‌ చానళ్లు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి’’ అని విమర్శించారు. బీజేపీలో సంస్థాగత మార్పులు రాబోయే కాలంలో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి రావడానికి నాంది పలుకుతున్నాయన్నారు.

శనివారం ప్రధాని మోదీ వరంగల్‌కు వస్తున్న సందర్భంగా ఈటల  హనుమకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానాన్ని సందర్శించి సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వరంగల్‌లో ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో నిర్వహించే విజయ సంకల్పసభతో ఎన్నికల శంఖారావం పూరిస్తామ న్నారు. బీజేపీలో భేదాభిప్రాయాలకు తావులేదని, అందరం ఐక్యంగా ఉన్నామని చెప్పారు. 

ప్రజాస్వామ్యం ఖూనీపై మోదీ ఆందోళన
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మోదీ ఆందోళన చెందారని ఈటల చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్‌ కుటుంబాన్ని వదిలేది లేదు, చట్టం నుంచి వారు తప్పించుకోలేరన్నారు. కేసీఆర్‌ కుటుంబపాలనకు అంతం పలికేది బీజేపీయేన న్నారు.

ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవంతో చెబుతు న్నానని, కాంగ్రెస్‌ హామీలు అమలు సాధ్యం కాద న్నారు. ఓరుగల్లు గడ్డమీద ముప్పై ఏళ్ల తర్వాత దేశ ప్రధానిగా మోదీ అడుగు పెట్టబోతున్నారని చెప్పా రు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, మాజీ మంత్రి విజయరామారావు పాల్గొన్నారు.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)