Breaking News

బీజేపీ మిత్రపక్ష పార్టీని ఓడించండి: మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్‌

Published on Mon, 07/08/2024 - 15:56

చెన్నై: తమిళనాడులోని విక్రవాండీ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షమైన పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) పార్టీని ఓడించాలని డీఎంకే నేత, మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్‌ అన్నారు. ఆయన సోమవారం  ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.  నీట్‌-యూజీ -2024 పరీక్ష పేపర్‌ లీకేజీ, అక్రమాల విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. అందుకే ఈ ఉపఎన్నికల్లో బీజేపీ మిత్రమైన పక్షమైన పీఎంకే పార్టీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

‘మీరు (ప్రజలు)  అంతా ఇప్పటికే  అధికార  డీఎంకే పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీపై డీఎంకే బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పింది. దీంతో ఉత్తరాది నేతలు కూడా బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేయటం మొదలుపెట్టారు. ఈ సమయంలో బీజేపీ మిత్రపక్షమైన పీఎంకే ఉపఎన్నిక బరిలో నిలిచింది.  అందుకే పీఎంకే పార్టీని ఓడించాలని కోరుతున్నా’అని  ఉదయ్‌ నిధి అన్నారు. పరీక్ష పేపర్‌ లీకైన నేపథ్యంలో జూన్‌ 28న తమిళనాడు అసెంబ్లీలో నీట్‌ పరీక్షను   రద్దు చేయాలని డీఎంకే ప్రభుత్వం  తీర్మానం చేసింది.

ఇక.. విక్రవాండీ  అసెంబ్లీ డీఎంకే ఎమ్మెల్యే ఎన్‌. పుగజేంటి అనారోగ్యం కారణాలతో  ఏప్రిల్‌ 6న మృతిచెందగా ఇక్కడ  ఉప ఎన్నిక జరగనుంది. ఇక.. ఇక్కడ పోటీ డీఎంకే  పార్టీ, పీఎంకే పార్టీకి మధ్య నెలకొంది. డీఎంకే నుంచి అన్నియూర్ శివ, పీఎంకే నుంచి  పార్టీ ఉపాధ్యక్షుడు సి అన్బుమణి అభ్యర్థులుగా బరిలో దిగారు. రెండు పార్టీలు వన్నియార్ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక్కడ దళిత ఓటర్లు మెజార్టీగా  ఉన్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)