Breaking News

మేనిఫెస్టో విడుదల చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే

Published on Thu, 04/25/2024 - 21:32

శివసేన (యూటీబీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే లోక్‌సభ ఎన్నికల 2024 కోసం పార్టీ మేనిఫెస్టోను గురువారం విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ జరగటానికి ఒకరోజు ముందు మేనిఫెస్టోను 'వచన్ నామ' పేరుతో విడుదల చేశారు.

శివసేన పార్టీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా దోపిడిని ఆపడం, ఉపాధి కల్పన, వ్యవసాయ రుణమాఫీ మొదలైనవాటిపైన ద్రుష్టి పెటుతోంది. రాష్ట్ర అభివృద్ధి ప్రధానం అంటూ ఉద్ధవ్ ఠాక్రే విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు.

ఉద్యోగాల కల్పన: రాబోయే రోజుల్లో ఉద్యోగ కల్పన చాలా అవసరం అని పేర్కొన్నారు. తప్పకుండా రాష్ట్రంలో కావలసిన ఉద్యోగాలను ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. ప్రజలు రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్లకుండా.. జిల్లా స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన అన్నారు.

రైతుల సంక్షేమం: వ్యవసాయ రుణాలను మాఫీ చేయడమే కాకుండా, పంట భీమాకు సంబంధించిన షరతులను కూడా సవరిస్తామని ఉద్ధవ్ ఠాక్రే మేనిఫెస్టోలో వెల్లడించారు. వ్యవసాయ పరికరాలు, విత్తనాల మీద GST లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. స్వామినాథన్ కమిటీ నివేదిక సిఫార్సు చేసిన కనీస మద్దతు ధర అమలు కూడా జరుగుతుందని ఆయన అన్నారు.

పన్నుల వ్యవస్థ: పన్ను ఉగ్రవాదాన్ని తగ్గించడానికి, న్యాయపరమైన.. సమన పన్నుల వ్యవస్థను నిర్థారిస్తామని ఠాక్రే అన్నారు.

పర్యావరణ పరిరక్షణ: మహారాష్ట్రలో పర్యావరణ అనుకూల ప్రాజెక్టులు, పరిశ్రమలను మాత్రమే అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

మహారాష్ట్రలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు శుక్రవారం (ఏప్రిల్ 26) రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. బుల్దానా, అకోలా, అమరావతి, వార్ధా, యవత్మాల్-వాషిం, హింగోలి, నాందేడ్, పర్భాని ప్రాంతాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 16,589 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)