Breaking News

తమిళ పాలిటిక్స్‌.. పార్టీ నేతలకు విజయ్‌ కీలక ఆదేశాలు

Published on Sat, 05/17/2025 - 07:42

సాక్షి, చెన్నై: పార్టీ పరంగా కమిటీలు, పదవుల భర్తీ ప్రక్రియలన్నీ ఈ నెలాఖరులోపు ముగించే విధంగా ముఖ్య నేతలకు తమిళగ వెట్రి కళగం నేత విజయ్‌ ఆదేశాలు ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలను జూన్‌ నుంచి విస్తృతం చేయడానికి సిద్ధమయ్యారు. పార్టీ ఏర్పాటుతో జిల్లాల కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలను విజయ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో ముఖ్య పదవులన్నీ దాదాపుగా భర్తీ అయ్యాయి. ఇతర కమిటీలలో కొన్ని పదవుల భర్తీ కసరత్తులు జరుగుతున్నాయి. ఎన్నికలకు మరికొన్ని నెలలు ఉన్న దృష్ట్యా, ఇక ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణలో విజయ్‌ ఉన్నారు.

ప్రస్తుతం విజయ్‌ నటిస్తున్న జననాయగన్‌ చిత్ర షూటింగ్‌ ఈనెలతో ముగియనున్నట్టు తెలిసింది. ఆ తర్వాత జూన్‌ మొదటి వారం నుంచి విజయ్‌ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఉండబోతున్నారు. ఇందులో భాగంగా విజయ్‌ పర్యటనలకు సంబంధించి గత రెండు రోజులుగా చెన్నైలో జిల్లాల కార్యదర్శుల సమావేశం విస్తృతంగా సాగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌ పర్యవేక్షణలో ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ పరంగా అన్ని ప్రక్రియలను, పదవుల భర్తీని ఈ నెలాఖరులోపు ముగించాలని విజయ్‌ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. జూన్‌ నుంచి ఆయన పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండబోతున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్‌ సైతం సిద్ధమవుతోంది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)