Breaking News

#GETOUT: తమిళనాట పొలిటికల్‌ హీట్‌.. విజయ్‌, పీకే ప్లానేంటి?

Published on Wed, 02/26/2025 - 12:26

చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నేడు సినీ నటుడు విజయ్‌ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలో చెన్నైలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు పార్టీ చీఫ్‌ విజయ్‌. ఈ కార్యక్రమానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ హాజరవుతున్నారు. దీంతో, తమిళ పాలిటిక్స్‌ రసవత్తరంగా మారింది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని స్థాపించి ముందుకు సాగుతున్నారు. నేడు పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. చెన్నైలోని మామల్లపురంలో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు దాదాపు మూడు వేల మంది ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో పాస్‌లను సైతం అందించారు. 

ఇక తమిళనాడులో వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలతో పొత్తులపై, ప్రచార యాత్రలపై విజయ్ కీలకమైన ప్రకటన చేస్తారని సమాచారం. పార్టీ అధ్యక్షుడు నటుడు విజయ్ సహా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో పాటు టీవీకే ఇతర ముఖ్య నేతలు ఈ సభకు హాజరుకానున్నారు. దీంతో, వేదికపై నుంచి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

హాట్‌ టాపిక్‌ బ్యానర్‌..
మరోవైపు.. టీవీకే పార్టీ ఆవిర్భావ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మొత్తం 6 అంశాలను ప్రస్తావించారు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తూ #GETOUT అనే హ్యాష్‌ ట్యాగ్‌ను చేర్చారు. ఈ బ్యానర్‌పై విజయ్‌ సంతకం కూడా చేశారు. అందులో మహిళల భద్రత, సంక్షేమానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాలు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. ఇక  నియంతృత్వ పాలనను సాగిస్తూ ప్రజా గొంతులను అణిచివేయడం, ఓటు బ్యాంకుల కోసం కులమతాల పేరుతో ప్రజలను విడగొట్టడాన్ని కూడా ఈ పోస్టర్‌లో పేర్కొన్నారు. పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆర్భాటాలు చేస్తున్నారని ఆరోపించారు. నూతన విద్యా విధానం, త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రతిజ్ఞ చేద్దామని కూడా ఆ పోస్టర్‌లో ఉంది.

 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)