కరువుతో కేసీఆర్‌ రాజకీయాలు

Published on Mon, 04/01/2024 - 05:59

సాక్షి, హైదరాబాద్‌: కరువు పరిస్థితులను రాజకీయం కోసం వాడుకుంటారా? అని మాజీ సీఎం కేసీఆర్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిలదీశారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నీటి నిర్వహణపై దృష్టి పెట్టకుండా, మంచినీటి కోసం పక్క రాష్ట్రాలను అభ్యర్థించాల్సిన అథోగతికి మీరు కారణం కాదా? అని ప్రశ్నించారు.

కేవలం రైతుబంధు పేరిట మిగతా విత్తన సబ్సిడీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ, యాంత్రీకరణ పథకం, డ్రిప్‌ స్ప్రింకర్లపై సబ్సిడీలన్నీ ఎత్తేసి రైతుల్ని కోలుకోలేనివిధంగా దెబ్బతీసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల పరిపాలనలో ఏనాడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ఒక్క రైతునైనా ఆదుకున్నారా? అని నిలదీశారు. కనీసం గత ఎన్నికల ముందు ప్రకటించిన రూ.10,000 అయినా నష్టపోయిన రైతులందరికి ఇచ్చారా? కేవలం మెదటి విడతగా రూ.150 కోట్లు మంజూరు చేసి, రెండో విడతగా ఏప్రిల్‌లో కురిసిన వడగళ్ల వానలకు నష్టపోయిన రైతులకు జీవో ఇచ్చి డబ్బు విడుదల చేయలేదని గుర్తు చేశారు. పంటల బీమా పథకాన్ని ఎత్తేసి, అంతకన్నా గొప్ప పథకాన్ని తెస్తామని ప్రగల్భాలు పలికి, రైతుల నోట్లో మట్టి కొట్టింది కేసీఆర్‌ కాదా? అని తుమ్మల నిలదీశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)