రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు

Published on Fri, 05/10/2024 - 05:38

సాక్షి, తిరుపతి: ‘రామోజీరావు నాకు చాలా సన్ని హితులు. నేను ఆయనను 15 సార్లకుపైగా కలి శా. ఒకసారి వెళ్లి కలిసినప్పుడు రామోజీరావు.. ‘కరుణాకర్‌రెడ్డి గారు.. రూ.2వేల కోట్లు జగన్‌ నుంచి ఇప్పిస్తే ఈనాడంతా మీ గు­రించే రాస్తాం’ అన్నారు. ఇది వాస్తవం.. ఏ ప్రమాణానికైనా నేను సిద్ధం. తన బిడ్డలు, మన­వళ్లపై ప్రమాణం చేసి కాదని రామోజీ చెప్పగ­లరా’ అని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

తిరుపతిలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రామోజీ కుమారుడు సుమన్‌ త­నకు బాగా తెలుసన్నారు. ఒకసారి కలి­సిన సమ­యంలో సుమన్‌ తన తండ్రి అన్న­మా­టలను త­నకు చెప్పుకుని బాధపడ్డారన్నారు. రామోజీÆకి తాను పుట్టలేదన్నారని.. అటు­వంటి నైజం తన తండ్రిదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో తాను దోపిడీ చేసి­నట్టయితే ఏ విచారణకైనా సిద్ధమని సవాల్‌ విసిరారు.

 1974లో రాడికల్‌ స్టూడెంట్‌ నాయ­కుడిగా ఉన్న సమయంలో నిధుల సేకరణ కోసం తిరుపతిలో ‘చక్రపాణి’ సినిమాను బెనిఫిట్‌ షోగా వేశామని తెలిపారు. అప్పుడు వర్సిటీలో చంద్రబాబుని తాను శ్రీధర్, హైకోర్టు అడ్వకేట్‌ సారధి వెళ్లి కలిశామన్నారు. ఆ సమయంలో బాబు కూర్చొని, ఆయన స్నేహి­తుడు పడు­కుని ఉన్నాడన్నారు. సినిమా టికెట్‌ కొనుగోలు చేయాలని అడిగితే.. నిద్రిస్తున్న తన స్నేహితుడి జేబులో ఉన్న రూ.2లను బాబు దొంగిలించి తన చేతిలో పెట్టారని తెలిపారు.

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)