Breaking News

గెలిచేది మేమే.. ‘హైదరాబాద్‌’కు న్యాయం చేస్తాం : మాధవీలత

Published on Tue, 06/04/2024 - 07:31

ఈ లోక్‌ సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చలో నిలిచిన పార్లమెంట్‌ స్థానం హైదరాబాద్‌. ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఇ ఇత్తెదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) పార్టీ బలంగా ఉన్న పార్లమెంట్‌ స్థానం అది. దశాబ్దాలుగా  అసదుద్దీన్ ఓవైసి హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రతిసారి అక్కడ ఇతర పార్టీలు నామమాత్రంగా తమ అభ్యర్థులను బరిలో నిలిపేవారు. కానీ ఈ సారి ఈ పార్లమెంట్‌ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మాధవీలత చాలా సీరియస్‌గా ప్రచారం చేసింది. పాతబస్తీలోని హిందూవులనంతా ఒక్కతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్‌ అయింది. బీజేపీ అధిష్టానం కూడా మాధవీలతకు చాలా సపోర్ట్‌గా నిలిచింది. అందుకే ఈ ఎన్నికల్లో ఆమె గట్టిపోటీ ఇచ్చింది. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ఎక్కువగా అసదుద్దీన్ ఓవైసి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పినా.. మాధవీలత మాత్రం హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో బీజేపీ జెండా ఎగరబోతుందని బలంగా చెబుతోంది. 

ఎన్నికల కౌంటింగ్‌కి కొద్ది గంటల ముందు ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ..‘ఫలితాల కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. బీజేపీ సానుభూతిపరులతో పాటు దేశం మొత్తం హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం ఎన్నికల ఫలితంపై ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మేము(బీజేపీ) గెలిచి హైదరాబాద్‌కు న్యాయం చేస్తాం. రెండు పర్యాయాలు గెలిచిన నరేంద్రమోదీ దేశ అభివృద్ధి కోసం ఎంత కృషి చేశారో అందరికి తెలుసు. దేశం మొత్తం మళ్లీ ఆయనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ సారి హైదారాబాద్‌తో పాటు  400 స్థానాల్లో బీజేపీ గెలవాలని దేశం మొత్తం కోరుకుంటుంది. అదే జరగబోతుంది’అని మాధవీలత అన్నారు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)