Breaking News

TS: చివరిసారిగా ఏకగ్రీవం ఎప్పుడు జరిగిందంటే..

Published on Thu, 10/26/2023 - 19:33

తెలంగాణ ఎన్నికల చరిత్ర.. ఆసక్తికర సమాచారం 

ఈ రోజుల్లో ఏకగ్రీవ ఎన్నికలు అంటే ఆశ్చర్యం కలగవచ్చు. ఒకప్పుడు కొందరు నేతలు శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నది అతిశయోక్తి కాదు. తెలంగాణకు సంబందించినంతవరకు చివరి ఏకగ్రీవ ఎన్నిక 2002 సంవత్సరంలో జరిగింది.

దేవరకొండ ఎస్టీ నియోజకవర్గం నుంచి 1999 ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ నేత ధీరావత్ రాగ్యానాయక్ నక్సల్స్ కాల్పులలో మరణించారు. తత్ఫలితంగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన భార్య భారతి ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు. మరణించిన రాగ్యానాయక్ గౌరవార్దం అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశంతో పాటు, ఇతర రాజకీయ పార్టీలు ఈ మేరకు నిర్ణయించాయి. అంతకుముందు కూడా పలు ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి.

తెలంగాణలో సుమారు ఇరవై మంది ఇంతవరకు ఇలా ఎన్నిక కాగలిగారు. ఈ ఏకగ్రీవ ఎన్నికలన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జరగడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య కూడా ఒకసారి ఉప ఎన్నికలో పోటీ లేకుండా శాసనసభకు నెగ్గారు.  1972 లో ఇందిరా గాంధీ ప్రభంజనంలో ఎక్కువ మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్లో యునానిమస్‌గా ఎన్నికైనవారిలో కోదాటి రాజమల్లు(చెన్నూరు), పి.నర్సారెడ్డి(నిర్మల్), జి.గడ్డెన్న(ముధోల్), ఎస్.భూపాల్(అమరచింత), ఎన్.రామచంద్రారెడ్డి(డోర్నకల్ ))కళ్యాణి రామచంద్రరావు(మక్తల్) ఎమ్.మాణిక్యరావు(తాండూరు) ఉన్నారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో మరికొందరు ప్రముఖులు ఉన్నారు. టి.రంగారెడ్డి(ఆర్మూరు-1962), జి.రాజారామ్(బాల్కొండ-1967), సీతాకుమారి(బాన్స్ వాడ-1957),కె.లక్ష్మినరసింహారావు(జగిత్యాల-1967),టి.అంజయ్య(రామాయంపేట-1981),వీరాస్వామి(కొడంగల్-1952), పద్మనాభరెడ్డి (వనపర్తి-1957) ఆర్.సురేంద్రరెడ్డి(డోర్నకల్ -1974), కె.రాంభూపాల్ (గద్వాల- 1962),పి.మహేంద్రనాద్ (నాగర్ కర్నూల్ -1957), ఎన్.యతిరాజారావు(చెన్నూరు-1975), కె.రామయ్య(బూర్గంపాడు-1968) మొదలైనవారు ఉన్నారు.

వీళ్లలో ఒకరిద్దరు తప్ప ఇలా ఏకగ్రీవంగా ఎన్నికైవారంతా కాంగ్రెస్కు చెందినవారే కావడం విశేషం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఏకగ్రీవ ఎన్నిక కూడా జరగలేదు.

:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)