Breaking News

సీఎం మమతకు ఝలక్‌!.. బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన టీఎంసీ ఎమ్మెల్యే

Published on Thu, 07/24/2025 - 09:12

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీలో పొలిటికల్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. టీఎంసీ రెబల్‌ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే హుమాయున్‌ కబీర్‌.. తాను కొత్త పార్టీ ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. బెంగాల్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ దాదాపు 50 స్థానాల్లో పోటీ చేస్తుందని బాంబు పేల్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

భరత్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్.. ఇటీవలి కాలంలో పార్టీ హైకమాండ్‌ను టార్గెట్‌ చేసి పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు. పలువురు నేతలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. దీంతో, రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు ఎమ్మెల్యే కబీర్‌ను హెచ్చరిస్తూ ఆయన వ్యాఖ్యలను వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు కబీర్‌ ప్రకటించారు.

టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేదా టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పట్ల నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. కానీ, కొందరు నేతలు నన్ను టార్గెట్‌ చేశారు. అందుకే నేను పార్టీని వీడాలనుకుంటున్నాను. జనవరి 1, 2026వ తేదీన కొత్త పార్టీ ప్రారంభించబోతున్నాను. మన పార్టీ రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 50 నియోజకవర్గాలలో పోటీ చేస్తుంది. నా కొత్త పార్టీ ముర్షిదాబాద్‌కు మాత్రమే పరిమితం కాదు. ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, నదియాలోని కొన్ని ప్రాంతాలలో 50–52 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెడుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక, హుమాయున్ కబీర్ మైనారిటీలు ఎక్కువగా ఉండే భరత్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఉత్తర బెంగాల్‌లో ఆయన కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో, ఆయన కొత్త పార్టీ.. అధికార టీఎంసీకి ఓట్లను చీల్చే అవకాశం ఉంది. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)