Breaking News

ఒడిశా కొత్త సీఎంగా గిరిజన నేత మోహన్‌ మాఝీ

Published on Tue, 06/11/2024 - 18:18

సాక్షి, భువనేశ్వర్‌: ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెర దించుతూ బీజేపీ అధిష్ఠానం.. మోహన్ చరణ్ మాఝీని సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభా పక్షం మోహన్‌  చరణ్ మాఝీని సీఎంగా ఎన్నుకుంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్‌ మాఝీ​కి బీజేపీ అధిష్టానం సీఎం పగ్గాలు అప్పగించింది. డిప్యూటీ సీఎంలుగా కనకవర్థన్‌ సింగ్‌ దేవ్‌, ప్రవతి పరిడా ఎన్నికయ్యారు. ఈ భేటీకి బీజేపీ అధిష్ఠానం తరఫున కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, భూపేంద్ర యాదవ్‌ హాజరయ్యారు. 

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార బీజేడీ పరాజయం పాలైంది. 24 ఏళ్లుగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్‌ పట్నాయక్‌ ప్రతిపక్షానికి పరిమితయ్యారు. ఒడిశా 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాల్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక బీజేడీ 51 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించగా, మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులకు దక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గాను బీజేపీ 20, కాంగ్రెస్ 1 గెలుచుకోవడంతో బీజేడీ ఘోర పరాజయం పాలైంది.

రేపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం 
రేపు సాయంత్రం 5 గంటలకు ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుని విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు.అనంతరం సాయంత్రం 5 గంటలకు జనతా మైదాన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.

 

 

 

 

 

 

 

 

Videos

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)