Breaking News

ఎన్నికల కౌటింగ్‌ కేంద్రంలో పేలిన బాంబు.. నాలుగో తరగతి విద్యార్థిని మృతి

Published on Mon, 06/23/2025 - 19:21

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఉప ఎన్నికల కౌంటింగ్‌ ఉద్రిక్తతకు దారి తీశాయి. సోమవారం కాళీగంజ్‌ నియోజక వర్గంలోని కౌంటింగ్‌లో నాటు బాంబు పేలి 10ఏళ్ల బాలిక మృతి చెందింది.

తూర్పు నదియా జిల్లా బరోచాంద్‌ నగర్‌ గ్రామంలో ఎన్నికల కౌంటింగ్‌ జరిగింది. ఘటన జరిగే సమయానికి ఈ కేంద్రంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ లీడింగ్‌లో ఉంది. ఆ సమయంలో కౌంటింగ్‌ కేంద్రంలో నాటు బాంబు పేలి నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక తమన్నా ఖాటూన్ తీవ్రంగా గాయపడింది.

ఊహించని పరిణామంతో అప్రమత్తమైన స్థానికులు చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దుర్ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)