Breaking News

అధిష్టానం అవకాశమిస్తే కామారెడ్డి నుంచి పోటీ చేస్తా: అజారుద్దీన్‌

Published on Fri, 03/10/2023 - 19:15

సాక్షి, కామారెడ్డి జిల్లా: అధిష్టానం అవకాశమిస్తే వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని లింగంపేట్‌లో అజారుద్దీన్‌ శుక్రవారం పర్యటించారు. ఆయన సమక్షంలో పలువురు వ్యక్తులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అజారుద్దీన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. 

అధిష్ఠానం అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయితే ఇప్పటికే కామారెడ్డి నుంచి బరిలో దిగేందుకు మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అజార్‌ వ్యాఖ్యలతో మరోసారి జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేగింది. కాగా గతంలోనూ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమంటూ  అజారుద్దీన్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)