Breaking News

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు

Published on Sun, 09/24/2023 - 01:34

సాక్షి, హైదరాబాద్‌: గ్రూ ప్‌–1 పరీక్షలను రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరగాలంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక మార్గమని తెలిపారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగలేఖ రాశా రు. ‘మీ పాలనలో వ్యవస్థల విధ్వంస ప్రతిఫ లమే ఈ దుస్థితి.

మీ అన్యాయమైన, దుర్మార్గ మైన పాలనకు విద్యార్థులు, నిరుద్యోగుల చేతిలో మీకు శిక్ష తప్పదు. తెలంగాణ ఏర్పా టైన నాటి నుంచి నిరుద్యోగ, విద్యార్థులకు అడుగడుగునా పరాభవమే ఎదురవుతోంది. ఇంటర్మీడియెట్‌ పేపర్ల మూల్యాంకనంలో తప్పులు, సింగరేణి, ఎంసెట్‌ పేపర్ల లీకేజీ, విద్యుత్‌ సంస్థల నియామక పరీక్షలు, పదో తరగతి పరీక్షలు, ఆ తర్వాత టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీతో మోసం పరాకాష్టకు చేరింది.

ఏం జరిగినా మీరు పట్టించుకున్న పాపాన పో లేదు. లక్షలాది మంది యువత నిద్రాహారాలు మాని పరీక్షలకు సిద్ధమవుతున్నారన్న ఆలోచన మీకు ఏ కోశానా లేదు. అసలు పరీక్షలు రద్దు కాదు. మీ సర్కారును రద్దు చేస్తేనే ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతుంది’ అని ఆ లేఖలో రేవంత్‌ విమర్శించారు. 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)