Breaking News

అసమ్మతిపై కాంగ్రెస్‌ ‘ఫోకస్‌’

Published on Mon, 09/30/2024 - 06:10

సాక్షి, హైదరాబాద్‌: వలస నేతల రాకతో క్షేత్రస్థాయిలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిపై అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల కారణంగా రాష్ట్రంలోని 20–25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించిందనే నిర్ణయానికి వచ్చిన పీసీసీ ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తోంది. టీపీసీసీ కొత్త చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ స్వయంగా ఇందుకోసం రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శిల సమక్షంలో ఆయా నియోజకవర్గాల్లోని పాత, కొత్త నాయకులు, కేడర్‌ను పిలిపించి మాట్లాడాలని, వారి అభ్యంతరాలు, సమస్యలను తెలుసుకుని రెండు బృందాలు కలిసి పనిచేసేలా సమన్వయం చేయాలనే నిర్ణయానికి పీసీసీ చీఫ్‌ వచ్చారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గద్వాల అసెంబ్లీ నేతలతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, అక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సరితాయాదవ్‌ల మధ్య సఖ్యత కుదిర్చారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది.

ఈ నియోజకవర్గమే కాకుండా ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకులకు సంబంధించి పది అసెంబ్లీ నియోజకవర్గాలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిన మరో పది నుంచి పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో కేడర్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తలనొప్పులు రాకుండా ముందే పరిస్థితిని సెట్‌ చేయాలని పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ నిర్ణయించారు.

సమర్థుల కోసం అన్వేషణ
పీసీసీకి కొత్త చీఫ్‌ నియమితులైన నేపథ్యంలో పాత కార్యవర్గం రద్దు కానుంది. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్‌ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులను కొత్తగా నియమించనున్నారు. అయితే, పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో జంబో కార్యవర్గం కాకుండా పదవుల సంఖ్యను తగ్గించే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై ఏఐసీసీ పెద్దలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. గతంలో నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు ఉండగా, ఇప్పుడు మూడుకు తగ్గించే అవకాశాలున్నాయి.

సీనియర్‌ ఉపాధ్యక్షుల నియామకంపై పునరాలోచన చేయాలని, ఉపాధ్యక్ష పదవులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో సీనియర్‌ నాయకులకు అవకాశమివ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి టీపీసీసీ అధికార ప్రతినిధులను ఏరికోరి ఎంపిక చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇటు పార్టీతో పాటు అటు ప్రభుత్వ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగేలా మాట్లాడగలిగిన సమర్థుల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో ఈసారి అధికార ప్రతినిధుల జాబితాలో కూడా భారీ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. ఇక, కొత్త పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ ఇటీవల విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పార్టీకి డీసీసీ అధ్యక్షులే కీలకమని చెప్పారు.

ఈ నేపథ్యంలో త్వరలోనే డీసీసీ అధ్యక్షుల మార్పు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలను జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించనున్నారు. ఇక, కొత్త పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ అక్టోబర్‌ 4వ తేదీ నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. తన సొంత జిల్లా అయిన నిజామాబాద్‌కు ఆయన ముందుగా వెళ్తారని, ఆ తర్వాత అన్ని జిల్లాల పార్టీ సమీక్షలు ముగించుకుని ఒక్కో జిల్లాకు వెళ్లి పార్టీ కేడర్‌కు మహేశ్‌గౌడ్‌ దిశానిర్దేశం చేస్తారని గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)