Breaking News

‘మీకు ఒక పార్టీ అండ కావాలి.. ఇప్పుడు ఎవరు ప్రేమ కావాలి?’

Published on Fri, 04/18/2025 - 16:35

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ప్రతీసారి ముస్లింలు, మజ్లీస్‌ మాత్రమే అంటూ కాలయాపన చేయడమే తప్పా రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూర్చారా అని నిలదీశారు. కిషన్ రెడ్డి.. ఒక కిస్మత్ రెడ్డి అంటూ సెటైర్లు వేశారు మహేష్‌ కుమార్‌గౌడ్‌,

హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  బీజేపీకి బలం లేకపోయినా పోటీకి దిగడాన్ని తప్పుబట్టారు. బలం లేనప్పుడు పోటీకి దిగి మిగతా పార్టీలపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ‘ప్రతీ ఎన్నికల్లో ఏదో ఓక పార్టీ అండతో గెలుస్తారు. కిషన్ రెడ్డి రాజకీయ జీవితంలో తెలంగాణ కు పైసా రూపాయి లాభం అయినా జరిగిందా?, ముస్లిం, మజ్లీస్ తప్ప కిషన్ రెడ్డి నుంచి మరో మాట రాదు. 

బలం లేకున్నా ఏ ఉద్దేశ్యంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది.  ఎవరి ప్రేమ కోసం బీజేపీ ఎదురు చూస్తుంది. మాకు బలం లేదు కాబట్టే పోటీ చేయలేదని మేము ప్రకటించాం. బీజేపీ, బిఆర్ఎస్ మధ్య ప్రేమ చిగురించింది’అంటూ ధ్వజమెత్తారు.ఏరోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసారా?, పూర్వ కాలంలో కిషన్ రెడ్డి, ఓవైసీ అన్నదమ్ములు అయ్యి ఉంటారు. 

రజాకార్ల అంటె కిషన్ రెడ్డికి ప్రేమ ఎందుకు?, ... పదే పదే రజాకార్ల ప్రస్తావన కిషన్ రెడ్డి ఎందుకు తెస్తున్నారు. రేషన్ బియ్యంలో కేంద్ర వాటా ఎంతో బండి సంజయ్ కి తెలుసా?, ఇతర రాష్ట్రాలలో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదో సంజయ్ సమాధానం చెప్పాలి’ అని ప్రశ్నించారు మహేష్ కుమార్ గౌడ్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)