Breaking News

తెలంగాణలో కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌!

Published on Mon, 05/26/2025 - 18:52

ఢిల్లీ: తెలంగాణలో కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గం కూర్పుపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి చర్చించారు. కేబినెట్‌లో ఆరు పదవులు ఖాళీ ఉండగా.. ఐదుగురిని భర్తీ చేస్తారని సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా.. బీసీ కోటాలో వాకిటి శ్రీహరి, ఎస్సీ కోటాలో వివేక్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్టీ కోటాలో రామచంద్రనాయక్‌, బాలు నాయక్‌ పేర్లు పరిశీలనలో ఉండగా.. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ప్రేమ్‌ సాగర్‌ రావు రేసులో ఉన్నారు.

త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ చీఫ్‌  మహేష్‌ గౌడ్‌ అన్నారు. ఈ అంశంపై రాహుల్‌తో కేసీ వేణుగోపాల్‌ సుదీర్ఘంగా చర్చించారన్నారు. కేబినెట్‌ విస్తరణపై మా అభిప్రాయాలు ఇప్పటికే చెప్పాం. రేపో, మాపో టీపీసీసీ కార్యవర్గం ప్రకటన కూడా ఉంటుందని ఆయన తెలిపారు. పీసీసీ కార్యవర్గ ఏర్పాటు, జై భీమ్ జై సంవిధాన తదితర అంశాలపై చర్చించానని మహేష్‌ గౌడ్‌ తెలిపారు.

ఢిల్లీలో రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్, మహేష్ కుమార్ గౌడ్‌ భేటీ అయ్యారు. మర్యాద పూర్వకంగా కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసానని.. తెలంగాణ రాష్ట్ర అంశాలను రాహుల్ గాంధీకి వివరించానని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. వీలైనంత త్వరగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని రాహుల్ గాంధీని కోరా.. త్వరగా చేస్తామని చెప్పారు.

ఇవాళ, రేపటిలోగా పీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే ఒకటి రెండు, సార్లు మా అభిప్రాయాలను అధిష్టానానికి తెలిపాం. తెలంగాణ క్యాబినెట్‌లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని అధిష్టానాన్ని కోరాం’’ అని మహేష్‌ గౌడ్‌ వెల్లడించారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)