‘సువేందును పోటీకి దింపాలి’.. బీజేపీకి టీఎంసీ సవాల్‌

Published on Mon, 03/25/2024 - 17:02

కోల్‌కతా: లోక్‌ సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, జాబితా విడుదల చేయటంలో బిజీగా ఉంటున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగంగా బీజేపీ.. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌ పోటాపోటీగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) నేత కునాల్‌ ఘోష్‌ బీజేపీకి సవాల్‌ విసిరారు.

బెంగాల్‌లోని డైమండ్‌ హార్బర్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించటంలో జాప్యం చేస్తుందని అన్నారు. ఆ స్థానంలో పోటీకి నిలపడానికి బీజేపీకి అభ్యర్థులే దొరకటం లేదని ఎద్దేవా చేశారు. డైమండ్‌ హార్బర్‌ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారిని పోటీకి దింపాలని టీఎంసీ నేత కునాల్‌ ఘోష్‌ సవాల్‌ విసిరారు.

‘బీజేపీ నేత సువేందు అధికారికి నేను బహిరంగ వివాల్‌ విసురుతున్నా. ఆయిన డైమండ్‌ హార్బర్‌ సెగ్మెంట్‌లో మా నేత అభిషేక్‌ బెనర్జీపై పోటీ చేయలి’ అని కునాల్‌ అన్నారు. ఇ‍ప్పటికీ డైమండ్‌ హార్బర్‌ సెగ్మెంట్‌లో బీజేపీ ఎవరినీ పోటీకి దింపలేదు. ఇక.. ఈ సీటులో పోటీ చేయాలని బీజేపీ తమ అభ్యర్థులను కోరుతోందని ఎద్దేవా చేశారు. అయితే టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీకి కంచుకోట అయిన డైమండ్‌  హార్బర్‌ సెగ్మెంట్‌ నుంచి బీజేపీ అభ్యర్థిని ప్రకటించకపోవటం గమనార్హం. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ 2014, 2019  రెండు సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజర్టీతో గెలుపొందారు.

ఆదివారం బీజేపీ ఐదో  జాబితాలో భాగంగా 111 మంది అభ్యర్థులు ప్రకటించింది. అందులో  బెంగాల్‌ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీకి దింపింది. ఇప్పటి వరకు మొత్తం 38 మంది అభ్యర్థులను బీజేప ప్రకటించింది. ఇక.. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఏడు విడతల్లో ఎ‍న్నికల  పోలింగ్‌ జరగనుంది.

చదవండి: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే మంత్రిపై కేసు

Videos

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)