Breaking News

‘ఇండియా’ ర్యాలీలో టీఎంసీ ఎంపీ కీలక ప్రకటన

Published on Sun, 03/31/2024 - 16:59

న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇప్పటికీ ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉందని ఆ పార్టీ ఎంపీ డెరిక్‌ ఒబ్రెయిన్‌ ప్రకటించారు. లిక్కర్‌ కేసులో అరెస్టయిన అరవింద్‌ కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆదివారం(మార్చ్‌ 31) ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో ఒబ్రెయిన్‌ పాల్గొని మాట్లాడారు.‘ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌(ఏఐటీసీ) ఇండియా కూటమిలో భాగస్వామిగానే ఉంది. ఇది బీజేపీకి ప్రజాస్వామ్యానికి మద్దతుగా జరుగుతున్న పోరాటం’అని ఆయన స్పష్టం చేశారు.

మరోపక్క ర్యాలీలో ఒబ్రెయిన్‌ ప్రసంగించిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేయడం విశేషం. కాగా, కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు కొలిక్కిరాకపోవడంతో వెస్ట్‌బెంగాల్‌లో సొంతగా పోటీ చేస్తున్నట్లు టీఎంసీ మార్చ్‌ నెల మొదట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్‌ ముఖ్య నేత,  ఆ పార్టీ లోక్‌సభ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి పై క్రికెటర్‌ యూసఫ్‌ పటాన్‌ను రంగంలోకి దింపింది.

ఏక పక్షంగా అభ్యర్థుల జాబితా ప్రకటించడంపై అధిర్‌ రంజన్‌ తీవ్ర విమర్శలు చేశారు. మమతాబెనర్జీని ఇక ముందు ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు నమ్మడని మండిపడ్డారు. తమ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రధాని కార్యాలయానికి కూడా టీఎంసీ పంపిందని, తాము ఇండియా కూటమిలో లేము అని చెప్పేందుకే ప్రధానికి కూడా అభ్యర్థుల జాబితా పంపారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే తాజాగా కాంగ్రెస్‌, టీఎంసీలు ఒక పార్టీపై మరొకటి సాఫ్ట్‌ కార్నర్‌ చూపిస్తుండటం చర్చనీయాంశమైంది. 

ఇదీ చదవండి.. దేశ ఆర్థిక మంత్రికి అప్పులు.. మరి ఆస్తులెంతో తెలుసా 

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)