Breaking News

Times Now ETG Survey: ‘ఫ్యాన్‌’ ప్రభంజనమే 

Published on Fri, 04/05/2024 - 02:45

సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి రోజురోజుకూ ప్రజల మద్దతు పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని ప్రముఖ జాతీయ మీడియా ఇంగ్లీష్‌ న్యూస్‌ ఛానల్‌ టైమ్స్‌ నౌ–ఈటీజీ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశంలో అన్ని రాష్ట్రాలతోపాటు ఏపీలోనూ ప్రజల అభిప్రాయాన్ని టౌమ్స్‌ నౌ సంస్థ నెల రోజులపాటు విస్తృతంగా సర్వే చేసింది.

ఈ సర్వే ఫలితాలను గురువారం రాత్రి టైమ్స్‌ నౌ ఛానల్‌ ప్రసారం చేసి చర్చ నిర్వహించింది. అత్యంత శాస్త్రీయంగా నిర్వహించిన ఈ సర్వేలో రాష్ట్రంలో 21 నుంచి 22 లోక్‌సభ స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంటుందని వెల్లడైంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టి జట్టుగా వచ్చినప్పటికీ ఘోర పరాభవం తప్పదని సర్వేలో తేలింది. బీజేపీకి రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా రాదని తేల్చింది. టీడీపీ, జనసేన కూటమి మూడు నుంచి నాలుగు ఎంపీ స్థానాలతో ఒకింత ఉనికి చాటుకునే అవకాశం ఉందని పేర్కొంది.  

విశ్వసనీయతకు పట్టం.. 
సర్వే ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టాయని చర్చలో పాల్గొన్న విశ్లేషకులు స్పష్టం చేశారు. గత ఎన్నికలతో పోల్చితే వైఎస్సార్‌సీపీ తిరుగులేని శక్తిగా అవతరించడానికి కారణాలపై ప్రధానంగా చర్చ సాగింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99.5 శాతం వాగ్దానాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అమలు చేసి ‘‘చెప్పాడంటే.. చేస్తాడంతే..’’ అనే నమ్మకాన్ని ప్రజల్లో పెంచుకున్నారు.

మీ బిడ్డగా మీ ఇంటికి మంచి చేశానని నమ్మితే ఓటేయాలంటూ సీఎం జగన్‌ ఇచ్చిన పిలుపు ప్రజల్లోకి బలంగా వెళ్లింది. రాష్ట్రంలో ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో సాకారమైన మార్పులు కళ్లెదుటే కనిపిస్తుండటంతో ప్రజలంతా సంక్షేమ సర్కారుకు జై కొడుతున్నారు. కూటమిగా చేరిన టీడీపీ, బీజేపీ, జనసేన పారీ్టలు నైతిక స్థైర్యం కోల్పోయి ఉనికి కోసం కుట్రలు చేస్తున్నాయి. 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)