కాంగ్రెస్‌ రెబల్‌కు బీజేపీ టికెట్‌.. మాజీ మంత్రి రాజీనామా

Published on Wed, 03/27/2024 - 07:58

హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ మంత్రి, లాహౌల్‌ - స్పితి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత రామ్‌లాల్‌ మార్కండ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన కాంగ్రెస్‌ రెబల్‌కు తాజా అసెంబ్లీ ఉప ఎన్నకల్లో బీజేపీ టికెట్‌ ఇవ్వడంతో పార్టీ నుంచి రామ్‌ లాల్‌ మార్కండ వైదొలిగారు.

అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్‌ మాజీ ఎ‍మ్మెల్యేలకు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్‌లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే రామ్‌లాల్‌ మార్కండ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.  లాహౌల్- స్పితి నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించారు. అది కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సంకేతాలివ్వడం గమనార్హం.

జై రామ్ ఠాకూర్ నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వంలో రామ్‌ లాల్‌ మార్కండ వ్యవసాయ, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో ఉన్న ఠాకూర్‌ చేతిలో 1542 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికల్లో లాహౌల్- స్పితి నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ రెబల్ ఠాకూర్ పేరు రావడంతో రామ్‌ లాల్‌ మార్కండ బీజేపీకి రాజీనామా చేశారు.

రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాలైన హమీర్‌పూర్, సిమ్లా, మండి, కాంగ్రా స్థానాలతో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జూన్ 1న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లాహౌల్- స్పితి నుండి ఠాకూర్‌తో పాటు, ధర్మశాల నుండి సుధీర్ శర్మ, సుజన్‌పూర్ నుండి రాజిందర్ రాణా, బర్సార్ నుండి ఇందర్ దత్ లఖన్‌పాల్, గాగ్రెట్ నుండి చెతన్య శర్మ, కుట్లేహార్ నుండి దేవిందర్ కుమార్ భుట్టోలను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)