Breaking News

‘పాలేరు నుంచే తుమ్మల పోటీ’

Published on Fri, 08/25/2023 - 14:28

సాక్షి, ఖమ్మం: ప్రజల నిర్ణయం మేరకు పాలేరు నుంచే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తారని ఆయన తనయుడు యుగంధర్‌ ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నాం ఖమ్మంలో భారీ కాన్వాయ్‌తో తుమ్మలకు ఘన స్వాగతం పలకగా.. యుగంధర్‌ అక్కడి మీడియాతో మాట్లాడారు. 

అనుచరులతో మాట్లాడి తుమ్మల భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తారు. ప్రజల నిర్ణయం మేరకే పాలేరు నుంచి ఆయన పోటీ చేస్తారు. ఎమ్మెల్యేగా గెలిచి సీతారామా ప్రాజెక్టు పూర్తి చేయాలన్నదే ఆయన అభిమతం అని తనయుడు తుమ్మల యుగంధర్‌ ప్రకటించారు.


బీఆర్‌ఎస్‌ తరపున పాలేరు టికెట్‌ ఆశించి భంగపడ్డ తుమ్మల.. గత మూడు నాలుగు రోజులుగా అనుచరులతో హైదరాబాద్‌ నుంచే చర్చలు జరుపుతున్నారు. అయితే ఆయన పార్టీ నుంచి జారిపోకుండా అధినేత కేసీఆర్‌ ప్రయత్నాలు చేయించారు. ఎంపీ నామా నాగేశ్వరరావును దూతగా పంపి.. తుమ్మలను నిలువరించే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఆయనకు నామినేటెడ్‌ పోస్ట్‌ ఆఫర్‌ చేసినట్లు ఊహాగానాలు వినిపించాయి. 

అయితే అందుకు తుమ్మల ఎలా స్పందించారో తెలియదుగానీ.. పాలేరు నుంచే పోటీ చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు తాజాగా ఆయన తనయుడి ప్రకటన చూస్తే స్పష్టమవుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లో ఆయన చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. ఒకవేళ అదే జరిగినా ఖమ్మం నుంచే ఆయనకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. 

ఇదీ చదవండి: భావోద్వేగంతో తుమ్మల కన్నీటి పర్యంతం

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)