Breaking News

తుమ్మల దారెటు?.. ఖమ్మంలో అనుచరుల భేటీ..

Published on Tue, 08/22/2023 - 16:07

సాక్షి, ఖమ్మం జిల్లా​: ఉమ్మడి జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టికెట్‌ తమకే వస్తుందని భావించిన వారికి భంగపాటు తప్పలేదు. పాలేరు నుంచి తనకే టికెట్‌ వస్తుందని చెప్పుకొచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్‌ను పొగుడుతూ ప్రకటనలు చేశారు. ఇంతలోనే సిట్టింగ్‌ ఎమ్మెల్యే కందాల పేరు ప్రకటించడంతో తుమ్మల వర్గం కంగుతిన్నట్లయింది.

ఇక కొత్తగూడెం స్థానం విషయంలో వనమాపై కోర్టు కేసు నేపథ్యంలో జలగం వెంకట్రావుకు టికెట్‌ ఇస్తారంటూ ప్రచారం గుప్పుమంది. అయినప్పటికీ సీనియారిటీ ప్రాతిపదికన వనమాకే టికెట్‌ కట్టబెడుతూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఈ క్రమంలో తుమ్మల అనుచరులు ఖమ్మంలోని వీసీరెడ్డి ఫంక్షన్‌ హాలులో మంగళవారం భేటీ అయ్యారు. తుమ్మల, జలగం కాంగ్రెస్‌ చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో ఖమ్మం రాజకీయాలు వేడెక్కాయి.

కాంగ్రెస్‌కే తుమ్మల అనుచరులు జై..
పాలేరు బీఅర్ఎస్‌లో అసమ్మతి సెగ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకే తుమ్మల అనుచరులు జై కొడుతున్నారు. సమావేశానికి పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి తరలివచ్చారు. తుమ్మలకు టికెట్ ఇవ్వకుండా పార్టీ అన్యాయం చేసిందంటున్న ఆయన అనుచరుల..  కాంగ్రెస్‌ వైపు మొగ్గుచుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తుమ్మలపై ఒత్తిడి పెంచే ఆలోచనలో ఆయన అనుచరులు ఉన్నారు. ఈ వారంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల్లో నుంచి తుమ్మల అనుచరులు భారీ ర్యాలీగా హైదరాబాద్ కు వెళ్లి తుమ్మలను కలవనున్నట్లు సమాచారం.

కాగా, వైరా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా తానే మళ్లీ పోటీలో ఉంటానని రాములునాయక్‌ నిబ్బరంగా ఉన్నా.. ఈ స్థానంలో మదన్‌లాల్‌ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారంతో రాములునాయక్‌ ప్రగతిభవన్‌కు వెళ్లి టికెట్‌ తనకే ఇవ్వాలని అభ్యర్థించినా నిరాశే ఎదురైంది. ఇక ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు కొందరు ఫిర్యాదు చేసినా అధిష్టానం ఆమైవెపే మొగ్గు చూపింది.


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)