Breaking News

ఎమ్మెల్యే చింతమనేనికి ఝలక్‌!

Published on Sun, 02/16/2025 - 07:02

ఏలూరు టౌన్‌: ఏపీలో కూటమి సర్కార్‌ ఏర్పడిన తర్వాత మూడు పార్టీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దెందులూరు ఎమ్మెల్యే చింత­మనేని ప్రభాకర్‌ రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో తమను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు తమపై దాడి చేశాడని ఏలూరు త్రీటౌన్‌ పోలీసులకు శనివారం ముగ్గురు వ్యక్తులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.

వివరాల ప్రకారం.. పెదవేగి మండలం రాయన్నపాలేనికి చెందిన నాగరాజు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి వద్ద కారు డ్రైవర్‌గా ఏడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం  మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరిని ఏలూరు శివారు సీతారామపురం గ్రామంలోని పద్మావతి కళ్యాణమండపంలో జరుగుతున్న ఓ వివాహానికి కారులో తీసుకెళ్లారు. ఆ సమయంలో ఎమ్మెల్యే చింతమనేని... నాగరాజును ఏరా అంటూ బూతులు మాట్లాడుతూ.. అసభ్యకరంగా తిడు­తూ అతని తల్లిని సైతం దూషిస్తూ దుర్భాష­లాడుతూ..  రాడ్డుతో దాడి చేశారు.

దీంతో, పోలీసు అధికారులు విచారణ చేసి చింతమనేని ప్రభాకర్‌తోపాటు ఆయన అనుచరులు వట్టి నాగబాబు, కలిదిండి అనిల్‌ రాజు, మరికొందరిపై చర్యలు తీసుకోవాలని నాగరాజు ఫిర్యాదులో కోరారు. అలాగే.. ఎమ్మెల్యే చింత­మనేని తమను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు దాడి చేశారని పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామానికి చెందిన జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పెనుమాల విజయ్‌బాబు, పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన మట్టా ప్రవీణ్‌  వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.  
 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు