Breaking News

అరవింద్‌ కేజ్రీవాల్‌కు ప్రాణహాని.. ఆప్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Published on Fri, 03/22/2024 - 14:00

సాక్షి, ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ప్రాణ హాని ఉందంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ సీనియర్‌ నేత, కేబినెట్‌ మంత్రి సౌరబ్‌ భరద్వాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేసిన కేజ్రీవాల్‌కు ప్రాణహాని ఉందని పదే పదే చెబుతున్నారని భరద్వాజ్ అన్నారు.

కేజ్రీవాల్‌ అరెస్ట్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరద్వాజ్‌ మాట్లాడారు. ఎక్సైజ్‌ పాలసీ కేసులో అరెస్టైన తర్వాత ఓ ఫార్మా కంపెనీ డైరక్టైర్‌ ఎలక్ట్రోరల్‌ బాండ్ల రూపంలో రూ.25 కోట్లను బీజేపీకి అందించారని ఆరోపణలు చేశారు. అంతేకాదు ఈడీ అరెస్ట్‌తో అరవింద్‌ కేజ్రీవాల్‌కు ప్రాణాలకు ముప్పు ఉందని అనుమానం వ్యక్తం చేశారు.  

‘హైదరాబాద్‌ కేంద్రంగా ఫార్మా కంపెనీ నిర్వహించే ఓ సంస్థ డైరెక్టర్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. సదరు కంపెనీ ఫార్మా కంపెనీ 2022 నవంబర్‌లో బీజేపీకి రూ.25 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను చెల్లించిందని’ ఆయన ఆరోపించారు.

తమ ఆమ్‌ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్‌పై అభియోగాలు మోపినట్లుగా సంబంధిత కేసులపై ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తీరు అమానవీయమ‍న్న భరద్వాజ్‌.. ఢిల్లీ సీఎం అరెస్ట్‌ తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు బంధువులకు, పార్టీ నేతలకు అనుమతి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)