Breaking News

‘సుపరిపాలన తొలి అడుగు’లో తమ్ముళ్ల తోపులాట..!

Published on Sat, 07/12/2025 - 20:12

తిరుపతి జిల్లా: ‘సుపరిపాలన తొలి అడుగు  కార్యక్రమం ఏమో కానీ ‘తెలుగు తమ్ముళ్ల తోపులాట’ కార్యక్రమం మాత్రం సజావుగా సాగుతోంది. ఈరోజు(శనివారం, జూలై 12) తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండల కేంద్రంలోని టీడీపీ ఆఫీస్‌ వద్ద సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించగా అది రసాభాసాగా మారింది. టీడీపీ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ శంకర్‌రెడ్డి ఎదుట తెలుగు తమ్ముళ్ల తోపులాట చోటు చేసుకుంది. 

టీడీపీలో తనకు గౌరవం ఇవ్వడం లేదంటూ మాజీ ఎంపీపీ బట్ట రమేష్‌ ఆందోళనకు దిగారు. తనకు ఎందుకు గౌరవం ఇవ్వడం లేదని రమేష్‌ డిమాండ్‌ చేశారు. పార్టీలు మారే రమేష్‌ను గౌరవించేది లేదంటూ మరో వర్గం సైతం ఆందోళనకు దిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్తా తోపులాటకు దారి తీసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 

యార్లగడ్డ వర్సెస్‌ పొట్లూరి 
కృష్ణాజిల్లాలోని గన్నవరం కేసరపల్లి వేదికగా తెలుగు తమ్ముళ్ల వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వర్సెస్ మాజీ ఏఎంసీ చైర్మన్ పొట్లూరి బసవరావు వర్గాలుగా తెలుగు తమ్ముళ్లు విడిపోయారు. ఇది కూడా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన అంశమే కావడం గమనార్హం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి గ్రామంలో ఎమ్మెల్యే యార్లగడ్డ. పర్యటిస్తున్న సమయంలో యార్లగడ్డ పర్యటనను బసవరావు వర్గం బాయ్‌కాట్‌ చేసింది. 

గ్రామంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద బసవరావు వర్గం సమావేశమైంది. దాంతో పెట్రోల్‌ బంక్‌ వద్ద పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. పార్టీ కోసం కష్టపడితే గెలిచాక ప్రక్కకి నెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం  గ్రామ పార్టీ నాయకులు, ,కార్యకర్తలు. ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎమ్మెల్యే పర్యటిస్తే తమకు సమాచారవ ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. గ్రామ పార్టీ కమిటీ రద్దు చేయకుండా కొత్తవారిని ఎలా ఎన్నుకుంటారని బసవరావు వర్గం నిలదీసింది.ఎమ్మెల్యే యార్లగడ్డ వైఖరిపై అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని అంటున్నారు.

 

 

గ్రామంలో ఎమ్మెల్యే పర్యటిస్తూ  కనీస సమాచారం ఇవ్వరా?????

గ్రామ పార్టీ కమిటీ రద్దు చేయకుండా కొత్తవారిని ఎలా ఎన్నుకుంటారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)