Breaking News

ఉద్రిక్తంగా మారిన కాంగ్రెస్‌ ‘పోస్టర్‌ ఆవిష్కరణ’

Published on Sun, 09/10/2023 - 01:42

చార్మినార్‌: చార్మినార్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి అనుమతిలేదంటూ పోలీసులు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చార్మినార్‌ వద్ద చేపట్టిన ‘బీజేపీ, బీఆర్‌ఎస్‌ దొందూ దొందే’అనే పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేను పోలీసులు గుల్జార్‌హౌస్‌ వద్ద అడ్డుకున్నారు.

ఈ కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పడంతో ఆయన వెనుతిరిగి వెళ్లిపోయారు. అనంతరం మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌తో పాటు పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొద్దిసేపు అక్కడ నిరసన తెలపడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని సిటీ కాలేజీ వరకు తరలించి వదిలేశారు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)