Breaking News

ఇచ్చిన హామీలను నెరవేర్చాలి 

Published on Sat, 02/04/2023 - 02:37

పర్వతగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల అన్నారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో శుక్రవారం తన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికలకు ముందు పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ విద్య, రైతు రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి మాటతప్పారని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగావకాశాలు కల్పించడానికి సంతకం చేస్తానని, గ్రామాల్లో బెల్ట్‌ షాపులు నిషేధిస్తామని అన్నారు. ఎనిమిదేళ్లుగా ఉద్యోగాలు లేక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ అధికార ప్రతినిధి చల్లా అమరేందర్‌రెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాడెం శాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)