Breaking News

సురేఖ-సీతక్క లొల్లిపై క్లారిటీ

Published on Wed, 06/12/2024 - 08:44

హైదరాబాద్‌, సాక్షి: ఇద్దరూ ఉమ్మడి వరంగల్‌కు చెందిన మహిళా నేతలు. పైగా మంత్రులు. కానీ, ఒకరంటే ఒకరికి పడడం లేదు. కనిపిస్తే కనీసం పలకరించుకోవడం లేదు సరికదా.. కలిసి పని చేయడం లేదు కూడా. మేడారం జాతర, లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్య విబేధాలు పబ్లిక్‌గా బయటపడ్డాయి.. అంటూ తాజాగా ఓ కథనం వెలువడింది. అయితే దీనిపై ఈ మంత్రులిద్దరూ స్పందించారు. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందట. రాజకీయాలు, పాలనా విషయాల్లో ఇద్దరి మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయట. పైచేయి సాధించేందుకు ఇద్దరూ పోటాపోటీ వ్యూహాలను అమలు చేస్తున్నారట. గతంలో మేడారం జాతర సమయంలో వీరి మధ్య మొదలైన పంచాయితీ కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల ఇన్‌చార్జి మార్పు విషయంలో తీవ్రస్థాయికి చేరిందట.. అంటూ ఓ మీడియా సంస్థ కథనం ఇచ్చింది. అయితే దీనిపై ఇద్దరూ మండిపడ్డారు.

తమ మధ్య విబేధాలు అనే వార్తలను సంయుక్తంగా ఈ ఇద్దరు మంత్రులు ఖండించారు. పరస్పర అవగాహనతో కలిసి మేం ముందుకు సాగుతున్నామని, మహిళా మంత్రుల మధ్య విభేదాలంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని స్పందించారు. పైగా ఆ కథనాలు మహిళా గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రగతికి, రాష్ట్రాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో వ్యవహరించాలి అని మంత్రులిద్దరూ హితవు పలికారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)