తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Published on Tue, 01/27/2026 - 13:08

సాక్షి, నల్లగొండ: నల్లగొండ ప్రాంత అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం టౌన్‌లోని బొట్టుగూడలో తాను నిర్వహించే కోమటిరెడ్డి ప్రతీక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

నేను నిప్పులా.. నిజాయితీగా బతుకుతున్నా. నల్లగొండ నా గుండెకాయ. అందుకే కొడంగల్‌కు ఎన్ని నిధులు తీసుకెళ్తారో.. తనకూ అన్నే నిధులు ఇవ్వాలని సీఎం రేవత్‌ను కోరా. వచ్చే ఎన్నికల్లో ఉత్సాహం ఉంటే పోటీ చేస్తా. లేదంటే ఇదే బొట్టుగూడ స్కూల్‌లో ఓ గది తీసుకుని ఉంటా. ఇక్కడి పిల్లల్లోనే చనిపోయిన నా కొడుకుని చూసుకుంటూ కాలం వెల్లదీస్తా. 

గత పదేళ్ల పాలన కారణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి భారంగా మారింది. ఆ టైంలో కనీసం సీఎం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. కార్పొరేట్ స్కూల్స్ పేరుతో దొంగలు దోచుకుంటున్నారు. నేను గనుక విద్యాశాఖ మంత్రి అయితే కార్పొరేట్ స్కూల్స్‌ను మూయించేస్తా. వైఎస్ఆర్ హయాంలో నల్లగొండలో ఎంజీ యూనివర్సిటీ నిర్మించా. లా పాటు అనేక నూతన కోర్సులను ఎంజీ యూనివర్శిటీలో తీసుకొచ్చా. నల్లగొండకు ఔటర్ రింగ్ రోడ్డును గిఫ్టుగా గడ్కరీ ఇచ్చారు. నల్లగొండలో ప్రతీ ఇంటికి 24 గంటల నీటిని అందిస్తాం.

చదువంటే ర్యాంకులు మాత్రమే కాదని ఓ ఆలోచన చేశాం. విద్యకు ప్రాధాన్యత ఇచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నాం. బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా డిజిటల్ విద్యను అందిస్తాం. ఇక్కడి ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ఇదే స్కూల్ చేర్పించాలి అని కోమటిరెడ్డి కోరారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)