Breaking News

‘ ఆ కార్యక్రమంలో నా గురించి మాట్లాడటం బాధాకరం’

Published on Sun, 10/12/2025 - 21:24

ధర్మపురి(జగిత్యాల జిల్లా): నిజామాబాద్‌లో మాల సోదరుల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లి తన సహచర మంత్రి వివేక్ మాట్లాడటం బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌.  జగిత్యాల జిల్లా ధర్మపురిలో సాక్షి టీవీతో మాట్లాడారు అడ్లూరి. 

‘లక్ష్మణ్ కుమార్  తండ్రి జయంతి కార్యక్రమాల్లో పేరు పెట్టకపోతే ప్రశ్నిస్తున్నాడు... ఇతర ఇన్విటేషన్స్ లో పేరు లేకపోతే ఎందుకు ప్రశ్నించడని వివేక్ మాట్లాడటం బాధాకరం. నేను ఆ విషయమే అసలెక్కడా మాట్లాడలేదు. వెంకటస్వామి జన్మదిన వేడుకలను నా ధర్మపురి నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిపాకే నేను హైదరాబాద్ వెళ్లాను.నాకు ఆ అభిమానం ఉంది.  నా మైనార్టీ శాఖ కార్యక్రమానికి వారే వచ్చి వస్తడా, రాడా వెళ్లిపొమ్మంటరా అంటూ మాట్లాడటం ఎంతవరకు సబబు..?, తోటి సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ నన్ను ఓ జంతువుతో పోలుస్తూ మాట్లాడితే కనీసం సహచర దళిత మంత్రిగా ఖండించకపోవడాన్నే నేను ప్రశ్నించా. 

తెల్లారే వ్యక్తిగతంగా ఫోన్ కాల్ అయినా చేస్తాడని భావించా. ఇవాళ మళ్లీ నిజామాబాద్‌కు వెళ్లి వ్యక్తిగతంగా నా పేరు తీసి మాట్లాడటం ఇక వివేక్ విజ్ఞతకే వదిలేస్తున్నా. 

 రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాలో ఉండి ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుని తేల్చుకోవాలి తప్ప ఈ విధంగా కామెంట్స్ చేయడం బాధాకరం. నేను కాంగ్రెస్‌ వ్యక్తిని, వ్యక్తిగత విభేదాలు ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నేను కాంగ్రెస్‌ పార్టీనే నమ్ముకుని ఉన్నా.  కాంగ్రెస్‌లో పెద్దలు ఆశీస్సులతో ఇంత వరకూ వచ్చా’ అని అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)