Breaking News

TG: ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు

Published on Mon, 09/09/2024 - 09:17

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం(సెప్టెంబర్‌9) కీలక ఆదేశాలు వెల్లడించింది. అనర్హత పిటిషన్‌లు స్పీకర్‌ ముందు ఉంచాలని, నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని స్టేటస్‌ రిపోర్టు తమకు దాఖలు చేయాలని కోర్టు తీర్పు ద్వారా  చేసింది. 

‘‘పిటిషన్‌లపై ఎప్పటిలోగా వాదనలు వింటాం. ఎన్నిరోజుల్లో విచారిస్తాం. తుది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటాం అనే అంశాలపై షెడ్యూల్‌ ప్రొసీడింగ్స్‌ విడుదల చేయాలి. లేదంటే మేమే ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారిస్తాం’’ అని కోర్టు  అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది.  

కాగా, తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ పిటిషన్‌ వేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్‌లో కోరారు.  ఇటు బీఆర్‌ఎస్‌,  అటు ముగ్గురు ఎమ్మెల్యేల తరపున లాయర్లు వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతపై ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్‌ఎస్‌ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. 

 

ఇదీ చదవండి.. స్పీకర్‌ వేటు వేయకుంటే.. సుప్రీంకు: కేటీఆర్‌

 

 

Videos

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు