Breaking News

అక్టోబర్‌ 10న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌?

Published on Sat, 09/30/2023 - 22:29

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అక్టోబర్ 10న ప్రకటించనున్నట్లు తెలిసింది. అక్టోబర్‌ మొదటి వారంలో ఈసీ అధికారుల బృందం నిర్వహించే సమీక్షా సమావేశం అనంతరం ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నేతృత్వంలోని ఈసీ బృందం అక్టోబర్‌ 3 నుంచి హైదరాబాద్‌లో పర్యటించనుంది. ఈ క్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై శాసనసభ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించనుంది.

తెలంగాణ గత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ 2018 అక్టోబర్ 6న విడుదల కాగా డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ జరిగింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలు కూడా  ఇదే తరహాలో జరుగుతాయని అందరూ భావిస్తున్నారు. 

ఎన్నికల తేదీలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలోని అధికార బీఆర్‌ఎస్‌ సహా పార్టీలన్నీ తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. ప్రత్యర్థులపై పట్టు సాధించేందుకు బీజేపీ  సీనియర్ జాతీయ నేతలను రంగంలోకి దింపాలని యోచిస్తోంది. అక్టోబరులో బీజేపీ ప్రతిరోజూ ఒక భారీ ర్యాలీ నిర్వహిస్తుందని పార్టీ నాయకులు తెలిపారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)