Breaking News

దీపాదాస్ మున్షీ మార్పు.. వారం లోపే కొత్త ఇంఛార్జ్‌?

Published on Wed, 02/12/2025 - 15:23

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో తెలంగాణ రాష్ట కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ దీపాదాస్ మున్షీ స్థానంలో కొత్త ఇంఛార్జ్‌ని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం లోపే కొత్త ఇంఛార్జ్‌ను నియమించడానికి హైకమాండ్‌ నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ఇంఛార్జ్‌లను ఏఐసీసీ మార్చనుంది. రాష్ట్ర నేతలకు ఇప్పటికే అధిష్ఠానం సంకేతాలు ఇచ్చింది. ఏడాదిలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో స్థానిక నేత అయిన దీపాదాస్ మున్షీకి పశ్చిమ బెంగాల్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

రాష్ట్రంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి ఏఐసీసీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే కొత్త ఇంఛార్జ్‌ను యమించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న దీపాదాస్ మున్షీ స్థానంలో మాజీ ముఖ్యమంత్రికి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కాగా, గత వారం  హైదరాబాద్‌లోని కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో సీఎంతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీ కోసం అందరం కలసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Telangana: గీత దాటితే వేటే..!
 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)