Breaking News

నేడే కాంగ్రెస్‌ తొలి జాబితా

Published on Sun, 10/15/2023 - 01:39

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితా విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. గత నెలరోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించేందుకు కాంగ్రెస్‌ పార్టీ రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించనుంది. కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం ముగిసిన నేపథ్యంలో ఆదివారం ఏ సమయంలోనైనా 58 మందితో కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితా వస్తుందని ఏఐసీసీ వర్గా లు వెల్లడించాయి.

ఆ తర్వాత ఇంకొక్క జాబితాలోనే మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని కూ డా కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. ఈనెల 18న ఆ జాబితా కూడా వస్తుందని తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనా ఒకట్రెండు రోజులేనని, ఈనెల 20లోపు 119 మంది అభ్యర్థుల ప్రకటన పూర్తవుతుందని ఆయా వర్గాలు వెల్లడించాయి. కాగా, అభ్యర్థుల ప్రకటన అంశంలో స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆదివారం 58 మందితో తొలి జాబితా వస్తుందని వెల్లడించడం గమనార్హం.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)