Breaking News

స్థానిక ఎన్నికలకు ‘భరోసా’ దిశగా..!

Published on Sun, 01/05/2025 - 03:00

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికలు, వాటికి ముందే రైతు భరోసా, ఇతర పథకాల అమలు ప్రధాన ఎజెండాగా శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. త్వరలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో.. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన కీలక అంశాలపై రెండు గంటలకుపైగా చర్చించినట్టు సమాచారం. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినా.. ఆ డబ్బు నేరుగా రైతులకు వెళ్లలేదని, రైతులకు నేరుగా సాయం అందకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లడం ఇబ్బందికరమని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ‘రైతు భరోసా’ పథకాన్ని అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళితే మంచిదని సూచించినట్టు సమాచారం.

ఈ పథకం అమలు తీరు ఎలా ఉండాలన్న దానిపై దాదాపు మంత్రులంతా తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు తెలిసింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గతంలో ఏటా రూ.10 వేలు పెట్టుబడి సాయం ఇవ్వగా ఇప్పుడు రూ.12 వేలకు పెంచుదామని... భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తున్నందున ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని సీఎం, డిప్యూటీ సీఎంలు వివరించినట్టు సమాచారం. ఈ మేరకు రూ.12 వేలు రైతు భరోసా ఇచ్చేందుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ..: ఇక రుణమాఫీ అనుకున్న ప్రకారం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని.. రుణమున్న ప్రతి రైతుకు మాఫీ జరగలేదనే చర్చ జరుగుతోందని కొందరు మంత్రులు ప్రస్తావించినట్టు తెలిసింది. రైతు రుణమాఫీ కోసం రూ.31 వేలకోట్లు అవసరమనే అంచనాల నేపథ్యంలో రూ.21 వేల కోట్లే ఇచ్చామని, ఇంత తేడా ఎలా వచ్చిందని కేబినెట్‌ భేటీకి హాజరైన ఉన్నతాధికారులను ఓ మంత్రి అడిగినట్టు సమాచారం.

ఇలాంటి సమయంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినా ప్రయోజనం ఉండకపోవచ్చని... ఎంపిక కాని వారి నుంచి ప్రతికూలత ఎదురవుతుందనే చర్చ జరిగినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని వాయిదా వేయాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలిసింది. మరోవైపు కొత్త రేషన్‌కార్డుల జారీ చాలా ముఖ్యమని, వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలనే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 26వ తేదీ నుంచి రూ.12 వేలు రైతు భరోసా, రూ.12 వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డుల జారీకి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)